- Advertisement -
భద్రాచలం : భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శుక్రవారం సాయంత్రం గాలివాన, ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురిసింది. రామాలయానికి అనుబంధ ఆలయమైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం ఎదుట ఉన్న ధ్వజస్థబంపై పిడుగుపడింది. ధ్వజస్థంబానికి కట్టిన దర్బలు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే వర్షం కూడా రావడంతో మంటలు వాటంతట అవే ఆగిపోయాయి. ధ్వజస్థబం పాక్షికంగా దెబ్బతింది.
ఎటువంటి ప్రాణనష్టం కలుగలేదు. పట్టణంలో పలు కాలనీలలోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. విద్యుత్‌కు అంతరాయం కలిగింది. స్వామివారి కల్యాణం రోజు ముహూర్త సమయంలో చినుకులు పడటం ఆనవాయితీ. కాగా శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాలు ముగిసాక భారీవర్షం కురవడంతో ఉత్సవాలకు ఆటకం ఏర్పడలేదు. దీంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
- Advertisement -