- Advertisement -
హైదరాబాద్: నగరంలో మరోసారి వర్షం దంచికొట్టింది. బుధవారం సాయంత్రం పలు ప్రాంతాలో భారీ వర్షం కురిసింది. దీంతో నీరు రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం వేళా కావడంతో నగరంలోని ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, మియాపూర్, చందానగర్, కూకట్‌పల్లి, మూసాపేట్, సనత్ నగర్ పంజాగుట్ట, లక్డీకాపూల్, అబిడ్స్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, హిమాయత్ నగర్, కోఠీ, నారాయణగూడతోపాటు తరతర ప్రాంతాల్లో వర్షం కురిసింది. మదాపూర్‌లో 32.5 మి.మి, కూకట్‌పల్లిలో 30.5, మూసాపేట్‌లో 28.8, వివేకానంద నగర్‌లో 24.5, బాలనగర్ 20.3, గచ్చిబౌలిలో 12.8, హైదర్‌నగర్‌లో 12 మి.మి. వర్షం కురిసింది.
- Advertisement -