భారీ వర్షాలు నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం నగరాన్ని ముంచెత్తగా, గురువారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నగరాన్ని వణికించింది. మెహిదీపట్నం, షేక్‌పేట్,ల క్డికాపూల్, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట్, యూసుఫ్‌గూడ, జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మూసాపేట్, బోరబండ, ముషీరాబాద్, చిక్కడ్‌పల్లి,దోమల్‌గూడ,ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
అశోకనగర్ చౌరాస్తా సమీపంలోని స్టీల్ బ్రిడ్జ్ దగ్గర విద్యుత్‌స్తంభాలు, చెట్టు కూలడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసివచ్చింది.పరిసర ప్రాంతాల్లో అంధకారం నెలకొంది. భారీ వర్షాలతో రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ జాం కావడంతో రాకపోకలు నిలిచిపోవడంతో వాహనదారులు నానా అవస్థలు పడాల్సివచ్చింది. పంజాగుట్ట సమీపంలో బేగంపేట్ వెళ్లే రహదారిపై భారీగా వరదనీరు నిలవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.