Friday, January 24, 2025

గ్రేటర్‌లో కుండపోత

- Advertisement -
- Advertisement -

మన గ్రేటర్ హైదరాబాద్‌ నగరంలో ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. పలు చోట్ల ప్రధాన రహదారులు నీట మునిగాయి.లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. కొద్దిపాటి వ్యవధిలోనే 7సెం.మీ.కు పైగా వర్షం కురిసింది. మియాపూర్ , చందానగర్, కేపిహెచ్‌బి కాలనీ, ప్రగతి నగర్ నిజాంపేట్, అమీర్‌పేట, జూబ్ల్లీహిల్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్, గండిమైసమ్మ, దుండిగల్ తదిత ర ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ప్రాంతంలో వర్షపు నీటికి వాహనాలు కొట్టుకుపోయాయి.ఇక కారు వరదనీటిలో కొట్టుకుపొతుండటంతో స్థానికులు గమనించి అందులో ఉన్న నలుగురు వ్యక్తులను కారు అద్దాలు పగులగొట్టి కాపాడారు. సికిందరాబాద్ ప్రాంతంలో రోడ్లపైకి మోకాటిలోతు నీరు చేరింది. నగరంలోని పలు చోట్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. భారీ వర్షం కురవడంతో జీ హెచ్‌ఎంసి అధికారలు రంగంలోకి దిగారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరికలు జారీచేశారు.

పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్ నగరంలో పర్యటించారు. జోనల్ కమిషనర్లు కు ఈవిడిఎం డైరెక్టర్లకు టెలికాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. రా ష్ట్రంలో రాగల ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఆవర్తనం పశ్చిమ బెంగాల్ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని వాతావరణశాఖ వెల్లడించింది. ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురి సే అవకాశాలున్నాయని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో కూడి న ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కొమ రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నల్గొండ, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడించింది.

పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది.సోమవారం నుం చి మంగళవారం ఉదయం వరకు నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. అదే సమయంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని వెల్లడించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబా ద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యా ల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ము లుగు జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం వివరించింది. గడిచిన 24గంటల్లో రాష్టంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు, పెద్దపల్లి, హన్మకొండ, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లా ల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News