Monday, January 27, 2025

నిర్మల్‌ జలమయం..

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : నిర్మల్‌లో ఆదివారం పట్ట పగలే కారు చీకట్లు కమ్ముకొచ్చాయి. మిట్ట మధ్యాహ్నం దాదాపు 1 గంట ప్రాంతంలో నల్లని మేఘాలతో చీకటిగా మారింది. దీంతో నిర్మల్ పట్టణంలోని వీధి దీపాలు పగటిపూటే దర్శనం ఇచ్చాయి. రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనాలు హెడ్ లైటు వేసుకొని మరీ ప్రయాణాలు కొనసాగించారు. ఆదివారం మధ్యాహ్నం దాదాపు రెండు గంటలపాటు ఎడతెరపి లేని వర్షంతో నిర్మల్‌లోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పట్టణంలోని మంచిర్యాల చౌరాస్తా, బస్టాండ్, ఈద్‌గాం చౌరస్తా , ముఖ్యంగా తిరుమల థియేటర్ ప్రాంతం మొత్తం జలమయమై రోడ్లన్నీ చెరువులను తలపించాయి.

దీంతో రాకపోకలు స్తంభించగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందు పడ్డారు. రోడ్ల పై ప్రవహించిన వర్షపు వరద నీటితో మోటర్ సైకిళ్లు , కారు సైతం కొట్టుకపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి దాదాపు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది. హుటాహుటిన చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయించారు. రోడ్డుకు అనుకొని మెడికల్ క్లినిక్స్, పలు షాపుల్లోకి వరదనీరు వచ్చి చేరింది. దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షం నిర్మల్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. దీంతో ప్రయాణికులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News