Wednesday, January 22, 2025

కరువుదీరా వానలు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రమంతటా గత నాలుగు రోజులుగా కురుస్తున్న కుండపో త వర్షాలతో వాగులు వంకలు వంతెనలెక్కి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది పరీవాహకంగా వర్ష బీభత్సం జ నం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మధ్య తరహా ప్రాజెక్టులన్నీ భారీగా చేరుతున్న వరదతో గరిష్ట స్థాయి నీటి మట్టాలకు చేరువవుతున్నాయి. అధికారులు ముందు జాగ్రత్త చర్యల కింద పలు ప్రాజెక్టుల గేట్లు తెరిచి వరద నీటిని వదిలి పెడుతున్నారు. ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని చేస్తున్న హెచ్చరికలు పరీవాహక గ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షం కాస్త తెరిపి ఇచ్చినప్పటికీ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మూసి , మంజీరా , ప్రాణహిత, కడెం , ఇంద్రావతి తదితర నదుల్లో వరద ఉధృతి తగ్గటం లేదు.నిర్మల్ జిల్లాలోని కడెం నది ఉధృతంగా ప్రవహిస్తోంది.

దీంతో ముందు జాగ్రత్తకింద అధికారులు కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేసే ప్రక్రియలో 14గేట్లు తెరుచుకోగా మరో 4వరద గేట్లు తెరుచుకోకుండా మొరాయించాయి .దీంతో అధికారులకు కొద్దిసేపు ముచ్చెమటలు పట్టాయి. కండెం ప్రాజెక్టు దిగువ ప్రాంతాల్లోని లొతట్టు గ్రామాల ప్రజలకు వణుకు పుట్టించింది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఈ సారి కూడా అటు వంటి పరిస్థితులే పునరావృతం అవుతాయన్న ఆందోళన మధ్య కొన్ని గంటల పాటు బిక్కుబిక్కు మంటు గడిపారు. స్థానిక యువకుల సాయంతో ఎట్టకేలకు ఆ నాలుగు గేట్లను తెరువగలిగారు. ఎగువనుంచి 93వేల క్యూసెక్కులు వస్తుండగా గేట్లు తెరిచి 1.55లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు .

దీంతో సాంయత్రానికి ప్రాజెక్కటులో నీటినిలువ 5టిఎంసిలకు తగ్గింది. ఎగువ నుంచి కూడా ఇన్‌ఫోస్ 40,025క్యూసెక్కులకు తగ్గింది.గేట్ల ద్వారా దిగువకు 1.03లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. పరిస్థితి అదుపులోకి రావటంలో ఊపిరి పీల్చుకున్నారు. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 1,35,512క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. దీంతో రిజర్వాయర్‌లో నీటినిలువ 45.2టిఎంసీలకు పెరిగింది. దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి2,61,454క్యూసెక్కుల నీరు చేరుతుండగా, గేట్లు తెరిచి దిగువకు 2,53,650క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ఉధృతంగా ప్రాణహిత.. మేడిగడ్డ వద్ద 5,33,960క్యూసెక్కులు
మహారాష్ట్ర , చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. మేడిగడ్డ వద్ద 5,33,960క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. లక్ష్మిబ్యారేజ్ 65గేట్లు తెరిచి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇంద్రావతి నదిలోకూడా భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. తుపాకులగూడెం సమక్క బ్యారేజి వద్ద ఇన్‌ఫ్లో 7,93,470క్యూసెక్కులు ఉండగా అంతే గేట్లు తెరిచి అంతే నీటిని దిగువకు వదులు తున్నారు. దుమ్ముగూడెం సీతమ్మ సాగర్ వద్ద ఇన్‌ఫ్లో 8,56, 541క్యూసెక్కులు ఉండగా అంతే నిటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
భద్రాచలం వద్ద 41.50అడుగుల నీటిమట్టం
భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం 41.50అడుగులకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఇక్కడ నీటిమట్టం 71.5అడుగులకు చేరిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ అక్కడే మకాం వేసి అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షిస్తున్నారు. గోదావరి వరదనీరు భద్రాచలం ఆలయ పరిసరాల్లోకి రాకుండా నీటిని ఎప్పటికప్పుడు తోడిపోసేందుకు సింగరేణికి చెందిన భారీ మోటార్లను సిద్దం చేసి వుంచారు. గొదావరిలో 8,56, 541క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.

ధవలేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక
గోదావరి నదిలో వరద ప్రవాహం పెరుగుతూ వస్తుండటంతో ఏపిలో ధవలేశ్వరం వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. నదిలో నీటిమట్టం 11.6అడుగులకు చేరింది. 9.64లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
మంజీరా ఉరకలు
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మంజీరా నదిలో కూడా వరద ఉధృతి పెరిగింది. సింగూరు ప్రాజెక్టులోకి 12515క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 20టిఎంసీలకు పెరిగింది.నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 38700క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో నీటి నిలువ 7.52టిఎంసీలకు పెరిగింది.

జంట జలాశయాలు.. గేట్లు ఎత్తివేత మూసి పరివాహం అప్రమత్తం
నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ జంట జలాశయాల్లోకి వరద ప్రవాహం పెరిగింది. హిమాయత్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఎగువ నుంచి వదర ప్రవాహం అధికంగా ఉందన్న సమాచారంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. రెండు గేట్లు ఒక్కో అడుగు ఎత్తి వేశారు. రిజర్వాయర్‌లోకి ఇన్‌ఫ్లో 1200క్యూసెక్కులు ఉండగా ,రెండు గేట్ల ద్వారా 700క్యూసెక్కులు దిగువ మూసిలోకి విడుదల చేస్తున్నారు. రిజర్వాయ్ గరిష్ట నీటినిలువ సమార్దం 3.9టిఎంసీలు కాగా, ప్రస్తుతం ఇందులో 2.760టిఎంసీలు నిలువ వుంది. గరిష్ట స్థాయి 1763.50అడుగులకు గాను 1762.75అడుగుల స్థాయిలో నీటిమట్టం ఉన్నట్టు అధికారులు వెల్లడించారు.

మరో వైపు నగరం నడిబోడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం కూడా గరిష్ట స్థాయికి చేరుకుంది. గరిష్ట స్థాయి నీటిమట్టం 514అడుగులకు గాను 513.62అడుగుల స్థాయికి నీరు చేరింది. అధికారులు హుస్సేన్ సాగర్ దిగువన లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు .మూసి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది.హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లాల పరిధిలొ మూసి నదికి ఇరువైపులా లొతట్టు ప్రాంతాలకు ముందస్తు హెచ్చరికలు చేస్తున్నారు.నల్లగొండ జిల్లా కేతపల్లి మండలంలోని మూసి ప్రాజెక్టులోకి 5466క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా , ప్రాజెక్టు 4గేట్లు ఎత్తి వేసి 4977క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
వంతెనలెక్కిన వరద రాకపోకలు బంధ్
భారీ వర్షాలు వరదల వల్ల వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వరదనీరు వంతెనలెక్కి ప్రహహిస్తుండటంతో ఆయా మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. వికారాబాద్ -తాండూర్ మార్గంలో వెనవెళ్లి వాగు పొంగుతోంది. కర్ణాటకలో చంబోల-తాండూరు మద్య రాకపోకలు నిలిచిపోయాయి. వలిగొండ మండలం సంగం పరిధిలో మూసి నది వరదనీరు వంతెనపైనుంచి ప్రవహిస్తోంది.ఈ బొల్లిపల్లి-చౌటుప్పల్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెళ్లి కాజ్‌వేపై వరదనీరు ప్రవహిస్తోంది. పొచంపల్లి-బీబినగర్ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రోడ్లెకాలువలు ఎగిరి పడుతున్న చేపలు!
ఎడతెరిపిలేని వర్షాలతో చెరువులు కుంటలు మత్తడి దూకుతున్నాయి. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లే కాలువలుగా మారాయి. వరదనీటితోపాటు కొట్టుస్తున్న చేపలు ఎగిరెగిరి పడుతున్నాయి. ప్రజలు రోడ్ల వెంట చేపలు వేటాడుత్నురు.

ఏడుపాయల ఆలయానికి వరదపోటు!
మంజీరా నదిలో వరద ఉధృతి పెరిగింది. మెదక్ జిల్లాలోని ఏడుపాయల ఆలయంలోకి వరద తాకిడి పేరిగింది.వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. గుడిలోకి నీరు చేరటంతో రాజగోపురంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తున్నారు.మరోవైపు నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కొందుర్తి వద్ద మంజీరా ,హరీంధ్ర ,గోదావరి కలిసే త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. ఇక్కడి శివాలయం నీటమునిగింది.
మరో రెండు రోజులు వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాట వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. హైదరాబాద్ నగర ప్రజలకు ప్రత్యేక హెచ్చరిక చేసింది. భారీ నుంతి అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున అవసరమైతే తప్ప ప్రజలు ఇల్లనుంచి బయటకు రావద్దని హెచ్చరించిది.గడిచిని 24గంటలుగా రాష్ట్రంలో అత్యధికంగా అదిలాబాద్ జిల్లా లొకరిలో 84.5 మి.మి వర్షం కురిసింది. కోటగిరిలో 74, నమూర్‌లో 67, చాపరాలలో 64.8, భోరజ్‌లో 58.3, బేలలో 58, రవీంధ్రనగర్‌లో 58,హసన్‌పల్లిలో 55.8, పిప్పాలధారిలో 55.8, జైనూర్‌లో 51.3, మి.మి వర్షం కురిసింది. గ్రేటర్‌హైదరాబాద్‌తోపాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News