Wednesday, January 22, 2025

బెజవాడ బెంబేలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / అమరావతి : భారీ వర్షాలకు ఉమ్మడి కృష్ణా జిల్లా తడిసిముద్దయింది. వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు, వీధులు, రహదారులు నీటమునిగాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదై రికార్డును సృష్టించింది. పలు ప్రాంతాల్లో వర్షం నీరు 4 అడుగుల మేర నిలవడంతో ఎటు చూసిన కాలనీలు, రోడ్లు చె రువులను తలపిస్తున్నాయి. ముఖ్యంగా విజయవాడ భా రీ వర్షాలకు చిగురుటాకులా గజగజ వణికింది. విజయ వాడ సిటీలోని ప్రధాన బస్టాండ్‌తో పాటు రైల్వేస్టేషన్ చు ట్టూ వరద నీరు చేరింది. అలాగే ఆటోనగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగింది. విజయవాడ శివారు కండ్రిగ వద్ద రహదారిపై భారీగా నీరు నిలిచిపోయింది. సింగ్‌నగర్, పైపుల రోడ్డు, సుందరయ్య నగర్, కండ్రిగ, రాజీవ్‌నగర్‌లు పూర్తిగా జలవలయంలో చిక్కుకుని చెరువులను తలపించాయి.

బుడమేరు వాగు ఉధృతం
విజయవాడ నగరంలోని బుడమేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరదనీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాం తాలకు వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో దిగువన ఉన్న కాలనీలు, వీధులు వరదనీటితో నిండిపోయాయి. గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పుట్టగుంట వ ద్ద వాగు ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. వంతెనకు నా లుగు అడుగుల మేరకు ప్రవాహం ఉంది. అధికారుల ఆ దేశాలతో గుడివాడ-హనుమాన్ జంక్షన్ రహదారిని పోలీసులు తాత్కాలికంగా మూసేశారు. అంబాపురంపైన ఉ న్న పాములు కాలువ, వాగులేరు కట్టలు తెగిపోయాయి.

మహోగ్రరూపం దాల్చిన మున్నేరు
తెలంగాణలో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తున్న గోదావరి ఉపనది మున్నేరు వాగు ఏపీలో అదే రీతిలో ప్రవహిస్తోం ది. ఎన్టీఆర్ జిల్లాలోని పరివాహక గ్రామాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లింగాల, పెనుగంచిప్రోలు వంతెనలపై ప్రమాదస్థాయిలో వరద చేరింది. ఎస్సీ కాలనీ, బోస్‌పేట జలమయం అయ్యా యి. ప లు చోట్ల విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో అధికారులు విద్యుత్‌ను నిలిపివేశారు. రహదారుల పై గుంతలు పడటంతో రాకపోకలు నిలిచిపోయాయి.

కృష్ణా నదికి 1.91 లక్షల క్యూసెక్కుల వరద
నవాబుపేట చెరువుకు గండి పడటంతో వరద ప్రవా హం పెరిగింది. కృష్ణా నదికి 1.90 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. బెల్లంకొండవారిపాలెంలో ఈదురుగాలులకు ఫారాల్లోని కోళ్లు పెద్ద సంఖ్యలో మృత్యువాతపడ్డాయి. కృష్ణా జిల్లావ్యాప్తంగా పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కృష్ణా ప్రవాహం పెరగడంతో అవనిగడ్డ మండలంలోని పాత హెడ్డంక గ్రామస్తులను పునరావాస కేంద్రానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News