Wednesday, January 22, 2025

తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (ఐఎండీ హైదరాబాద్) తెలిపింది. ఉత్తర తెలంగాణలోని 8 జిల్లాలకు భారీ వర్ష సూచన వరంగల్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి జిల్లాలతో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 115.6 నుంచి 204.4 మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మరో ఏడు జిల్లాల్లో 64.5 నుంచి 115.5 మిల్లీమీటర్ల మధ్య వర్షాలు కురుస్తాయి.

Also Read: పట్నంలో ఎన్నికల హీట్?

కాగా, శుక్రవారం రాత్రి హైదరాబాద్ పరిసర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బండ్లగూడ జాగీర్, రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, కూకట్‌పల్లి, హైదర్‌నగర్, ఆల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్, బాచుపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, అల్వాల్, తిరుమలగిరి, బేగంపేట, మారేడ్‌పల్లి, చిలకలగూడపల్లిలో వర్షం కురిసింది. దీంతో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News