Friday, November 15, 2024

ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్షసూచన

- Advertisement -
- Advertisement -
Heavy Rain Forecast to Andhra Pradesh
మూడు రోజుల పాటు వర్షాలు: వాతావరణ శాఖ

అమరావతి: దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శని,ఆదివారాలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అమరావతి వాతావరణశాఖ పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో దక్షిణ శ్రీలంక తీరం వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం.. కోమరిన్ ప్రాంతం, దానిని ఆనుకొని ఉన్న శ్రీలంక తీర ప్రాంతానికి చేరుకుంది. ఇది సగటు సముద్ర మట్టానికి.. 1 .5 కిలోమీటర్లు ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. మరో అల్పపీడనం దక్షిణ అండమాన్ సముద్రంలో నవంబర్ 29 తేదీకల్లా ఏర్పడవచ్చని, తిరుపతి, నెల్లూరులో 13 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశముందని..వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

48 గంటల్లో మరింత బలపడి, పశ్చిమ వాయువ్యదిశలో ప్రయాణించే అవకాశం ఉందని తెలిపారు. ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు,ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. ఒకటి, రెండు చోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌కు వాన ముప్పు ఇంకా తొలగిపోలేదు. వర్షకాల సీజన్ ముగిసినప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాలు వరద ప్రభావానికి లోనై తీవ్ర పంట, ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌పై మరో అల్పపీడనం ఏర్పడ వచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కొనడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News