Sunday, December 22, 2024

తెలంగాణకు భారీ వర్షసూచన

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఈనెల 23 వరకూ తేలికపాటి నుంచి అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ నుండి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకూ సగటు సముద్ర మట్టం నుండి 3.1కి.మి నుండి 5.8 కిమి మధ్యలో కొనసాగిన ద్రోణి ఆదివారం బలహీనపడింది. కిందిస్థాయిలో గాలులు పశ్చిమ దిశనుండి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది.

అలాగే, ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఈ నెల 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వివరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News