Thursday, November 21, 2024

కొత్తగూడెంలో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

Heavy Rain hits Bhadradri Kothagudem

కొత్తగూడెం: భారీ వర్షంతో జిల్లా కేంద్రమైన కొత్తగూడెం అతలాకుతలమైంది. శనివారం మధ్యాహ్నం 2.40 నుంచి దాదాపు గంటన్నరపాటు కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రం జలదిగ్బంధనంలో చిక్కుకుంది. కొత్తగూడెం చుట్టుపక్కన ప్రాంతంలో లోతట్టుప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి. అన్ని సరైన డ్రైన్ వ్యవస్థ్ధ లేని కొత్తగూడెంలో అండర్‌బ్రిడ్జిలో నీరు నిలిచిపోయిన వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రాచలం -ఖమ్మం, విజయవాడ -భద్రాచలం ప్రధాన రహదారి ఇదే కావటంతో ట్రాఫిక్ జాం వల్ల పలు సమస్యలు తలెత్తుతున్నాయి. దాదాపు అర్థగంట పాటు బిడ్జిలోకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోస్టాఫీసు నుంచి హెడ్‌ఆఫీసు వచ్చే మార్గంలో సైతం డ్రైన్లు సెయింట్‌మేరీస్ వద్ద డ్రైన్ మూసి ఉంచటం వల్ల ఈ నీరంతా రోడ్డుపై చేరింది. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పట్టణం ఇలా భారీ వర్షానికి అతలాకుతలమైంది. పట్టణంలో డైన్లు సిల్ట్‌అప్ అయి ఉన్నాయి. కొత్తగూడెం పట్టణంలోని కూలీలైన్‌లో కూడాఅలాగే కూలిలైన్ లో ఇళ్లలోకి నీరు చేరింది. పోస్టాఫీసు సెంటర్ నుంచి బస్టాండుకు వచ్చే మార్గంలో సరైన డ్రైన్ లేక నీరంతా రోడ్డుపైకి చేరింది. ప్రకాశం స్డేడియం పొడవునా చిల్ట్రన్ పార్క్ వరకు నీరు రోడ్డు పై చేరి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తగూడెం పట్టణంలోని గొల్లగూడెం నుంచి హేమచంద్రాపురం వెళ్లేమార్గంలో రోడ్డు కు కుడివైపు కొత్తగా ఇళ్లు, పునాదులు కట్టారు. దీనితో ఎదురుగడ్డ పంచాయతిలోని చెరువులోకి వెళ్లే నీరంతా రోడ్డుపై ఆగిపోయింది. రోడ్డు బాగా దెబ్బతిన్నది. 14 వ వార్డు లో నీరు ఇళ్లలోకి చేరింది. లక్ష్మీదేవిపల్లి మండలంలో సైతం భారీ వర్షం కారణంలో జనజీవనం స్ధంభించింది. లోతువాగు పంచాయతీ కొమరంభీం కాలనీలో వర్షం కారణంగా నీరు నిలిచిపోయింది. అక్కడి సర్పంచ్ స్వయంగా పార చేత బట్టి నీరు బయటకు వేళ్లేందుకు దారిచేశారు. ప్రశాంతి నగర్ పంచాయతిలో ఇళ్లలో నీరు చేరింది. దిశ కమిటీ సభ్యురాలు మందపల్లి ఉమ ఇంటి వద్ద పక్కన గోతిలో నీరు నిండిపోయి నీరు మొత్తం ఇంటిలోకి చేరింది. మునిసిపాలిటి నుంచి వెళ్లే నీళ్లతో శ్రీనగర్ పంచాయతిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చుంచుపల్లి మండలంలోని విద్యానగర్ లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News