యైటింక్లయిన్‌కాలనీ: గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో సింగరేణి సంస్థలోని ఓపెన్‌కాస్టు ప్రాజెక్టులు తడిసి ముద్దయ్యాయి. కంపెనీలోని వేలాది యంత్రాలు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. వేలాది మంది కార్మికులు విశ్రాంతి మందిరాలకే పరిమితమయ్యారు. ప్రాజెక్టుల నుంచి చిన్న మట్టి పెళ్ల పైకి రాలేదు. కొద్ది పాటిగా బొగ్గు బయటకు వచ్చింది. ఓవర్‌బర్డెన్ (మట్టి) తీస్తున్న ప్రైవేట్ కంపెనీలకు భారీగా నష్టం వాటిల్లింది. బుదవారం సింగరేణిలోని 11 ఏరియాల్లో 19 ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల్లో రోజుకు లక్షా 45 వేల 610 టన్నుల బొగ్గు ఉత్పత్తి కావాల్సి ఉండగా 73 శాతంతో లక్షా 6 వే 412 టన్నుల బొగ్గు రవాణ జరిగింది. ప్రాజెక్టులోని క్వారీలు పూర్తిగా జలమయం కావడంతో లోపల ఉన్న బొగ్గు బయటకు రాలేదు. కానీ కోల్‌బెంచ్‌ల్లో ఉన్న బొగ్గును థర్మల్ వపర్ స్టేషన్‌లకు రైల్ ద్వారా రవాణా చేశారు. ప్రాజెక్టుల్లోని రోడ్లన్ని బురదమయం కావడంతో చిన్న మట్టి పెళ్ల కూడ బయటకు రాలేదు. ముఖ్యంగా ఓబి నిర్వహిస్తున్న ప్రైవేట్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి.
ఆర్‌జి2 ఏరియా ఓసిపి3 ప్రాజెక్టులోని డ్రాగ్‌లైన్ ద్వారా మాత్రం 10548 క్యూబిక్ మీటర్ల ఓబి బయటకు వచ్చింది. కంపెనీ నిర్వహిస్తున్న షవల్స్, డంపర్ల ద్వారా 18 వేల 290 క్యూబిక్ మీటర్ల ఓబి వచ్చింది. కంపెనీ ద్వారా ఒక లక్షా 38 వేల 98 క్యూబిక్ మీటర్ల ఓబికి గాను కేవలం 13 శాతం మాత్రమే బయటకు వచ్చింది. ప్రైవేట్ ఓబి కంపెనీలు నిత్యం 9 లక్షల 83 వేల 691 క్యూబిక్ మీటర్లు పూర్తిగా తుడిచి పెట్టుకొనిపోయింది. వందలాది వాహనాలు, వేలాది మంది ఉద్యోగులు మస్టర్లు పడి ఇళ్లకు తిరిగి వెళ్లారు. ప్రైవేట్ కంపెనీలకు జీతాల రూపేణా కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. కొత్తగూడెం ఏరియాలోని జికె ఓసిపిలో 8148 టన్నులకు 7476 టన్నుల బొగ్గు రాగా 146667 క్యూబిక్ మీటర్ల ఓబి పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయింది. జెవిఆర్ ఓపెన్‌కాస్టులో 16667 టన్నులకు 17447 టన్నుల బొగ్గు రాగా 3 లక్షల ఓబి నష్టపోయింది. కిష్టారంలో 4444కు 3534 టన్నులు రాగా ఓబి 38710 కూ.మీ నష్టం జరిగింది.
ఇల్లెందు ఏరియాలోని కోయగూడెంలో 7923కు గాను 3232 టన్నులు ఓబి 41935 రాలేదు. జెకె 5 ఓసి 6577కు గాను 3325 టన్నులు రాగా, ఓబి 25581 నష్టం జరిగింది. మణుగూర్ ఏరియాలో పికె ఓసి2లో 14815కు గాను 12536 బొగ్గు రాగా, 83871 ఓబి రాలేదు. పికె ఓసిపి4లో 9259కు 11611 బొగ్గు, 71100 ఓబి నష్టం వచ్చింది. మణుగూర్ ఓసి 5296కు 6879 టన్నుల బొగ్గు, ఓబి 46774 రాలేదు. ఆర్‌జి1 ఏరియాలో మేడిపల్లి ఓసిపిలో 3704కు 1180 బొగ్గు, 19355 ఓబికి నష్టం వాటిల్లింది. ఆర్‌జి2లోని ఓసిపి3లో 13333కు గాను 10097 టన్నుల బొగ్గు, ఓబి 34516, ఓసిపి3 ఫేజ్2లో 6667కు గాను 4756 బొగ్గు, 55 వేల కూ.మీ ఓబి నష్టం జరిగింది. ఆర్‌జి3 ఏరియా ఓసిపి2 ప్రాజెక్టులో 6296కు 2479 బొగ్గు రాగా 69300 ఓబి నష్టం వచ్చింది. ఓసిపి1 ప్రాజెక్టులో 6667కు 7994 బొగ్గు, 41936 ఓబి రాలేదు. భూపాలపల్లి ఏరియాలో కెటికె ఓసిపి2లో 2963 బొగ్గు, ఓబి 38710 కూ.మీ. మొత్తానికే రాలేదు. కెటికె ఓసిలో 2963 బొగ్గు, 66129 ఓబి రాలేదు.
బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసిపిలో 8333 బొగ్గుకు 2984 రాగా 99497 ఓబి నష్టం వచ్చింది. ఓసిపి2 259 టన్నుల బొగ్గు, 1129 ఓబి రాలేదు. మందమర్రి ఏరియాలో ఆర్‌కె ఓసిపి1లో 4444కు 3850 టన్నుల బొగ్గు రాగా ఓబి 42258 నష్టం వచ్చింది. కెకె ఓసిపిలో 5370కు 4033 బొగ్గు, 55806 ఓబి రాలేదు. శ్రీరాంపూర్ ఏరియాలో ఓసిపి2 8519కు 1905 బొగ్గు, 82258 ఓబి నష్టం వచ్చింది. 1కె ఓసిపి 2963కి 1074 బొగ్గు, 45161 ఓబి రాలేదు. గురువారం రోజున ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడం, మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యంత్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నీటి పంపులను సైతం ఎత్తు ప్రదేశాల్లోకి తరలిస్తున్నారు. గురువారం రోజున బొగ్గు పెళ్ల, చిన్న మిట్టి పెళ్ల బయటకు రాలేదు.