Monday, December 23, 2024

భూపాలపల్లిలో కుండపోత వర్షం.. నీట మునిగిన ఊరు..

- Advertisement -
- Advertisement -

జయశంకర్ భూపాలపల్లి: జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు పడుతున్నాయి. ఈ క్రమంలో భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మొరంచలో దాదాపు 15 ఫీట్స్ హైట్లో నీరు చేరి ఊరు నీట మునిగింది. దీంతో స్థానిక ప్రజలు అంత కూడా బస్టాండ్ ఆవరణలో ఉన్న ఒక పెద్ద బిల్డింగ్ పైకి ఎక్కి వర్షములో గడుపుతున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి సహాయక చర్యలు తీసుకోవాలని ఆ ఉరి ప్రజలు కోరుతున్నారు.

మరోవైపు, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని బూరుపేట శివారులో ఉన్న మారేడు కొండ చెరువు కట్టకు గండి పడింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బుధవారం ఉదయం నుండి మత్తడి దుంకుతుండగా రాత్రి కట్ట తెగిపోయింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News