Monday, December 23, 2024

ఢిల్లీలో భారీ వర్షం…

- Advertisement -
- Advertisement -

 

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీ వర్షం వల్ల ఢిల్లీలోని లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. భారీ వర్షం వల్ల ఢిల్లీలో పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఢిల్లీలో గాలుల ధాటికి పలుచోట్ల వృక్షాలు కుప్పకూలాయి. రోడ్లపై చెట్లు పడడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాలలో గోడలు కూలి ఇళ్లు ధ్వంసంగా మారాయి. భారీ వర్షం వల్ల విమానాలు రాకపోకలు నిలిచిపోయాయి. విమానాశ్రయంలో భారీ సంఖ్యలో ప్రయాణికులు నిరీక్షిస్తున్నారు. సంబంధిత విమానయాన సంస్థలను సంప్రదించాలని ప్రయాణికులకు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News