Monday, December 23, 2024

బిపర్‌జాయ్ భీకరం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: గత వారం రోజులుగా గుజరాత్ తీరప్రాంతాలను వణికిస్తున్న తీవ్ర తుపాను ‘బిపర్‌జాయ్’ గురువారం సాయంత్రం గుజరాత్ కచ్ ప్రాంతంలోని కోట్‌లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరప్రాంతంలో భీకర గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తుపాను పూర్తిగా తీరం దాటడానికి దాదాపు 6 గంటల సమయం పడ్తుందని భారత వాతావరణ శాఖ( ఐఎండి) అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. తీరం దాటే సమయానికి ఇది మరింత పెరిగి గంటకు 120 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు చెప్పారు.

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తుపాను కారణంగా కచ్, దేభూమి ద్వారక, జామ్‌నగర్, పోరుబందర్, రాజ్‌కోట్, మోర్బి, జునాగఢ్ జిల్లాల్లో 11.5 సెంటీమీటర్లనుంచి 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, కొన్ని ప్రాంతాల్లో 25 సెంటీమీటర్ల దాకా కూడా వర్షం పడవచ్చని, అందువల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు మునకకు గురయ్యే ప్రమాదం ఉందని ఐఎండి డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.కచ్ జిల్లాలో ఇప్పటికే 120 గ్రామాలకు చెందిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ జిల్లాతో పాటుగా తుపాను ప్రభావం ఉండవచ్చని భావిస్తున్న మొత్తం 8 జిల్లాలనుంచి దాదాపు లక్ష మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు రాష్ట్ర అధికారులు తెలిపారు.తుపానుపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బుధవారం గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్‌లో అత్యవసర సమీక్ష నిర్వహించారు.

కేంద్రంనుంచి 8 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, రాష్ట్రం తరఫున ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు 12, రోడ్లు, భవనాల విభాగంనుంచి 115 బృందాలు, విద్యుత్ విభాగంనుంచి 397 బృందాలను తీర వెంబడి జిల్లాల్లో మోహరించారు. మరో వైపు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్టుగార్డు బృందాలు బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర ఆహార పదార్థాలు లాంటి వాటితో సిద్ధంగా ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News