Sunday, December 22, 2024

వానావస్థలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్/ సిటీ బ్యూరో: ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం… గ్రేటర్ హై దరాబాద్ నగరాన్ని వరదలతో ముంచెత్తింది. కేవలం అరగంటలో లోతట్టు ప్రాంతాలు పూర్తి గా జలమయమయ్యాయి. రోడ్లన్నీ జలాశయాలను తలపించాయి. వాహనాలు ఎక్కడికక్కడే ని లిచిపోయాయి. నాలాల పైకప్పులు కొట్టుకుపోయాయి.పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఇదంతా గురువారం సాయంత్రం నగరంలో కురిసిన భారీ వర్షంతో తలెత్తిన సమస్యలు. చినుకుపడితే జంకే పరిస్థితి లో లోతట్టు ప్రాంతవాసులు ఉన్నారు. ఒక గం టపాటు కురిసిన భారీ వర్షంతో పాటు ఈదురుగాలులు కాస్త నగర ప్రజల్లో కొంత ఆందోళనల ను రేకెత్తించింది. అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురియగా, సికింద్రాబాద్‌లో అత్యధికంగా 9.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మ ల క్ పేటలో 8.4, బంజారాహిల్స్ వేంకటేశ్వర కా లనీలో 8.3 సెం.మీ.లు, బంజారాహిల్స్ మా ణికేశ్వర కాలనీలో 8.7 సెం.మీ.లు మలక్ పేట్ మలత్ కమిటీ హాల్ ప్రాంతంలో 8.5 సెం. మీ లు, నాంపల్లి పరిధిలో
8.3 సెం.మీ.లుగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలోనూ అంతరాయం కలిగింది. బంజారాహిల్స్ పరిధిలోని ఉదయ్‌నగర్‌లో నాలా పైకప్పు కొట్టుకుపోయింది. మరోవైపు వర్షం పడిన గంట సమయంలోనే సేవల కోసం 70కి పైగా ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. ఏదైనా ప్రాంతాల్లో వరద నీటి సమస్యలు ఉంటే జీహెచ్‌ఎంసి కంట్రోల్ రూం 040–21111111, 9000113667 నెంబర్లకు ఫోన్ చేయాలని అధికార వర్గాలు ప్రకటించారు.

జలమయమైన రోడ్లు& ట్రాఫిక్ జామ్
భారీ వర్షం కారణంగా నగరంలో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు రోడ్లపైనే గంటల కొద్దీ వాహనాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. నగరంలో ప్రధాన ప్రాంతాలైన నాంపల్లి, సికింద్రాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరోవైపు రాయదుర్గం బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐకియా, ఐటీ కారిడార్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీంతోపాటు కూకట్‌పల్లి, ఖైరతాబాద్, ఉప్పల్, బాచుపల్లి, ఎల్బీ నగర్, మియాపూర్, యూసఫ్ గూడ, నిజాం పేట సహా పలు ప్రాంతాల్లో వర్షం రాకతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బేగంపేట్, పంజాగుట్ట, సికింద్రాబాద్ పరిధిలో రోడ్లు జలమయమయ్యాయి. వర్షం పడుతున్న సమయంలో రోడ్లపై ఉన్నవాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షం పూర్తిగా తగ్గిన తర్వాత నీరు రోడ్లపై నుంచి వెళ్ళిన తర్వాత వాహనదారులు మెల్లగా కదలారు.

ప్రమాదకరంగా&
గ్రేటర్ హైదరాబాద్ లో కురిసిన వర్షానికి నాలాల పైకప్పు, నాలా రిటైనింగ్ వాల్ లు ప్రమాదకరంగా మారుతున్నాయి. గురువారం కురిసిన భారీ వర్షానికి బంజారాహిల్స్ ఉదయ్ నగర్ కాలనీ నాలా పైకప్పు కొట్టుకుపోయింది. దీంతో పరిసర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. ప్రధాన నాలాలు పికెట్, రంగదాముని, కూకట్ పల్లి, హుస్సేన్ సాగర్ నాలాలు వర్షం పడితే ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటి వెంట ఉండే బస్తీలు బిక్కుబిక్కుమంటున్నాయి. మలక్ పేట్ రైల్వే అండర్ బ్రిడ్జీ క్రింద వరద నీరు నిలిచి ప్రమాదకరంగా మారింది. ఆ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, మైండ్ స్పేస్ నుంచి జెఎన్ టియుహెచ్ మార్గాలు ప్రమాదకరంగా మారాయి. ఓవైపు వర్షంతో జలమయమైన రోడ్లలో ఒకేసారి సాఫ్ట్ వేర్ కంపనీల ఉద్యోగులందరూ బయటకు రావడంతో ఆ మార్గాలు పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. వాటర్ లాగింగ్ ప్రదేశాలు వాహనాలకు ప్రమాదకరంగా మారడంతో వాహనదారులు తీవ్ర అవస్థపడాల్సి వచ్చింది.

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి మృతి
తెలంగాణపై పిడుగుల వాన కురిసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులు బలమైన ఈదురుగాలులతో కూడిన కుండపోత వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో వర్షం ధాటికి జనజీవనం స్తంభించిపోయింది.. గ్రేటర్ హైదరాబాద్ నగరం తడిసిముద్దగామారింది. పలు మార్గాల్లో డ్రైనేజిలు పొంగిపొర్లి గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. సంగారెడ్డి పట్టణంలో దాదాపు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. రంగారెడ్డి, వేములవాడ జిల్లాల్లో పిడుగుపాటుకు ముగ్గురు చనిపోగా ఐదుగురికి గాయాలయ్యాయి. చాలాచోట్ల ధాన్యం తడిచిపోయి రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా మారడంతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసాయి. ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. పలుచోట్ల కొనుగోలు కేంద్రాల్లో, కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. ధాన్యాన్ని రక్షించుకోవడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు.

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో కల్లాల్లోని ధాన్యం తడిసిపోయింది. అకాల వర్షాలతో రోడ్లపై నీరు చేరి వాహనదారుల ప్రయాణాలకు అంతరాయం కలిగించింది. అకాల వర్షంతో ఎండబోసిన ధాన్యం తడిసి ముద్దగా మారింది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్ష ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ పాపన్నపేటలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. సంగారెడ్డి పట్టణంలో దాదాపు అరగంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగి నీరు రోడ్లపై నిలిచింది. దీంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది కలిగింది. సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట వర్షపునీరు భారీగా నిలిచింది పోతిరెడ్డిపల్లి చౌరస్తా పరిసర ప్రాంతంలో డ్రైనేజీలు నిండి పొంగిపొర్లాయి. గాలి దుమారంతో భారీ కేట్లతో పాటు పలు ప్రాంతాల్లో చెట్లు విరిగి రోడ్డుమీద పడ్డాయి.

పండ్లతోటలకు తీవ్ర నష్టం :
కోహిర్ మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం పడింది. మండలంలోని కోహీర్, బిలాల్ పూర్, మనియార్ పల్లి, సజ్జాపూర్, బడంపేట్ గ్రామాల్లో వాన దంచి కొట్టింది. ఈదురుగాలులతో కురిసిన వర్షానికి మామిడి, అరటి, బొప్పాయి తోటలకు నష్టం వాటిల్లింది. బిలాల్ పూర్‌లో కొద్దిసేపు వడగండ్ల వాన కురిసింది. పలు జిల్లాల్లో మామిడితోటలు భారీ వర్షానికి చెట్లపై ఉన్న కాలయలు నేలరాలాయి.
పిడుడుపాటుకు ముగ్గురు మృతి
రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపాటుకు ముగ్గరు వ్యక్తులు మృతి చెందారు .ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగానూ భారీ వర్షాలు కురిశాయి. వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని శాత్రాజ్‌పల్లిలో పిడుగుపాటుకుకంబాల శ్రీను అనే వ్యక్తి మృతి చెందగా నలుగురు గాయపడ్డారు. ఇదే జిల్లాలోని తంగళ్లపల్లి మండలం భరత్‌నగర్‌క చెందిన రామడుగు చంద్రయ్య అనే వ్యక్తి పిడుగుపాటుకు ప్రాణాలు కొల్పోయారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం కర్కల్‌పహాడ్ సమీపంలో పిడుగు పడి ఒకరు మృతిచెందారు. ఈ ఘటనలో మరొకరికి గాయాలయ్యాయి.కలకొండ గ్రామానికి చెందిన పసూనూరు ప్రవీణ్ పిడుగు పడి మృతిచెందగా ,అయన మామ జంగయ్య గాయాపడ్డారు.మాడుగుల గ్రామానికి చెందిన గౌని నిరంజన్ విద్యుత్‌షాక్ వల్ల గాయపడ్డారు.

మహబూబాద్‌లో 122.3మి.మి వర్షం
రాష్ట్రంలో గురువారం నాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా మహబూబాబాద్‌లో 122.3మి.మి వర్షం కురిసింది. వెల్దండలో 100.8, బంజారాహిల్స్‌లో 87.5, మలక్‌పేటలో 85.3, యూసఫ్‌గూడలో 84.3, బేగంబజార్‌లో 83, గోల్కొండలో 76.8, నాంపల్లిలో 76.3 ఇ.మి వర్షం కురిసింది. గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.రాష్ట్రంలోని 460 కేంద్రాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కాగా పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా అదిలాబాద్‌ల ఓ41.9డిగ్రీలు నమోదైంది.
23జిల్లాలకు ఎల్లో అలర్ట్
రానున్న మరో 5రోజులపాటు రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్,వరంగల్,హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చెల్‌మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ , నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, నారాయణపేట్, జోగులాంబగద్వాల, జిల్లాల్లో అక్కడక్కడా వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాల్లో గంటకు 40కి.మి వేగంతో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News