Saturday, April 5, 2025

హైదరాబాద్ లో భారీ వర్షం.. పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:నగరంలో భారీ వర్షం కురుస్తోంది. సిటీలోని పలు ప్రాంతాల్లో వాన పడుతోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్ గూడ, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి, మియాపూర్, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, ప్రగతి నగర్, బాచుపల్లి, మూసాపేట, బోయిన్ పల్లి, అమీర్ పేట్, పంజాగుట్టా, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, కాచిగూడ, సికింద్రాబాద్ వంటి ఏరియాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ తోపాటు పలు జిల్లాల్లో వర్షం కురుస్తోంది.

ఇవాళ ఉదయం నుంచి కొన్ని ప్రాంతాల్లో మెఘాలు కమ్ముకుని వాతావరణం చల్లబడి ఉంది. మరోవైపు, రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వడగండ్ల వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News