హైదరాబాద్: నగరంలో శుక్రవారం కురిసిన భారీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షానికి పలు చోట్ల రహదారులపై భారీగా నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద ట్యాంక్‌బండ్ నుంచి లోయర్ ట్యాంక్‌బండ్ వెళ్లే మార్గంలో చెట్టు కూలింది. నాంపల్లి రెడ్ హిల్స్ రోడ్డుపై చెట్టు కూలి రోడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. బషీర్‌బాగ్‌లో పిజి లా కాలేజ్ ముందు రోడ్డుపై వృక్షం కూలిపోయింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. లంగర్‌హైస్ బాపునగర్‌లో భారీ వృక్షం కూలి రెండు విద్యుత్ స్తంబాలు విరిగిపోయింది. అస్మాన్‌గఢ్ విద్యుత్ డివిజన్ పరిధిలో 67 ఫీడర్లు ట్రిప్ అయ్యాయి. ఇక పలు ప్రాంతాల్లో విద్యుత్ పునరుద్ధరణలో అధికారులు జాప్యం చేస్తున్నారు.
నగరంలో భారీ వర్షం.. తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -