హైదరాబాద్: భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము వరకు కుండపోతం వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మంగళవారం రెండు గంటల వ్యవధిలో దాదాపుగా 8 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. వరద నీరు లోతట్టు ప్రాంతాలలోని ఇళ్లల్లోకి చేరాయి. రాత్రి కురిసిన వర్షానికి పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందిపడుతున్నారు.
Also Read: ప్రియురాలి కుమారుడిని వేడి నీళ్లలో ముంచి… హత్య
వరద నీరు నిలిచిన చోట జిహెచ్‌ఎంసి బృందాలు రంగంలోకి దిగాయి. రోడ్లపై నిలిచిన నీరు డ్రైనేజీల్లోకి వెళ్లేలా సిబ్బంది చర్యలు చేపట్టారు. సహాయం కోసం 0402955550 ఫోన్ చేయాలని జిహెచ్‌ఎంసి సిబ్బంది తెలిపారు. యూసఫ్‌గూడలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలు పడడంతో గోడకూలి 8 నెలల పసికందు మృతి చెందింది. పెద్ద ఇంటి గోడ రేకుల షెడ్డుపై పడింది. రేకుల షెడ్డులో దంపతులు తన చిన్నారితో కలిసి నిద్రిస్తున్నారు. కూలిన చిన్నారిపై పడడంతో ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందగా దంపతులు తీవ్రంగా గాయపడ్డారు.