హైదరాబాద్: నగరంలో భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున 5 గంటలకు ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండిలో అధికంగా 7.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంసిలాల్ పేట్ లో 6.7 సెంటీమీటర్లు, వెస్ట్ మారేడ్ పల్లిలో 6.1 సెంటీమీటర్, అల్వాల్లో 5.9 సెంటీమీటర్లు, ఎల్బీ నగర్ లో 5.8 సెంటీమీటర్లు, గోషామహల్, బాలానగర్ లో 5.4 సెంటీమీటర్లు, ఏఎస్ రావు నగర్ లో 5.1 సెంటిమీటర్, బేగంపేటలోని పాటిగడ్డలో 4.9 సెంటీమీటర్లు, మల్కాజ్గిరిలో 4.7 సెంటీమీటర్లు, సరూర్ నగర్, ఫలక్నామాలో 4.6 సెంటి మీటర్లు, గన్ ఫౌండ్రీలో 4.4 సెంటీమీటర్లు, కాచిగూడ, సికింద్రాబాద్ లో 4.3సెంటీమీటర్లు, చార్మినార్ లో 4.2 సెంటీమీటర్లు, గుడిమల్కాపూర్, నాచారంలో 4.1 సెంటి మీటర్, అంబర్ పేట్ లో 4సెంటీమీటర్లు, అమీర్ పేట్, సంతోష్ నగర్ లో 3.7 సెంటీమీటర్లు, ఖైరతాబాద్లో 3.6 సెంటీమీటర్లు, బేగంబజార్, హయత్ నగర్, చిలకనగర్ లో 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో భారీగా రహదారులపైకి వరద నీరు వచ్చి చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అధికారుల ఆదేశాలతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి సిబ్బంది సహాక చర్యలు చేపట్టారు.
Heavy Rain in Hyderabad