హైదరాబాద్: నగరంలో పలు చోట్ల వర్షం కురిసింది. శుక్రవారం తెల్లవారుజాము నుంచి వర్షం జల్లులుగా పడ్డాయి. ఆ తరువాత భారీ వర్షం కురవడంతో రోడ్ల పైకి నీరు చేరింది. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్ పేట, యూసఫ్ గూడ, తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది. 9 నుంచి 10 గంటల మధ్య భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. వర్షం తాకిడిని తట్టుకునేందుకు మెట్రో ఫిల్లర్లతో పాటు ప్లైఓవర్‌ల కింద వాహనాదారులు తలదాచుకున్నారు. రోడ్లన్నీ జలమయంగా మారాయి. భారీ వర్షాలతో రోడ్ల పైకి నీరు చేరడంతో ట్రాఫిక్ క్లియర్ చేయడానికి గంట సమయం పడుతుందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్లపైకి రావొద్దని విద్యార్థులకు, ఉద్యోగస్థులకు పోలీసులు సూచించారు. షియర్ జోన్ ప్రభావంతో హైదరాబాద్ తో సహా తెలంగాణలో రెండు మూడు రోజులు కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం…..
- Advertisement -
- Advertisement -
- Advertisement -