- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : నగరంలో భారీ వర్షానికి రోడ్లు జలమయంగా మారాయి. రహదారులపై వర్షపు నీరు రావడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి రోడ్లపై నిలిచే పరిస్థితి ఏర్పడింది. దీంతో జీహెచ్‌ఎంసీ అత్యవసర బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంతాల్లోని నీరు వరద కాల్వల ద్వారా తొలగించారు.నాలుగు రోజులుగా కురుస్తున్న వానలకు బయటకు వెళ్లాలంటే జనం జంకుతున్నారు. బుధవారం అమీర్‌పేట, పంజాగుట్ట, బేగంపేట, జూబ్లీహిల్స్, కాప్రా, ఎ.ఎస్‌రావు నగర్, నెరెడ్‌మెట్, యాప్రాల్, మౌలాలి, మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్, తార్నాక, ఓయు, ముషీరాబాద్, చిక్కడ్‌పల్లి, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లిబర్టీ, లక్డీకాపూల్, మెహిదిపట్నం, మాసబ్ ట్యాంక్, బంజారాహిల్స్ కొండాపూర్, ఖైరతాబాద్, ఎర్రగడ్డ, మూసాపేట్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో కురిసింది.
- Advertisement -