Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఎక్కడివారు అక్కడే గప్ చుప్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రానున్న మూడురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఉదయం నుంచి దంచి కొట్టిన ఎండ ఉన్నట్టు ఉండి సాయంత్రం వాతావారణం ఒక్క సారిగా చల్లబడింది. నగరంలోని కుత్బుల్లాపూర్, జగద్గిరిగుట్ల, చింతల్, బాలానగర్, పంజాగుట్ట, అమీర్ పేట్, టోలీచౌకి, సికింద్రాబాద్, గచ్చిబౌలి మెహదీపట్నం, ఎర్రగడ్డ, కోఠి తదితర ప్రాంతాల్లో బారీవర్షం పడుతోంది. దీంతో ఎక్కడి వాహనదారులు అక్కడ నిలిచిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News