Sunday, January 19, 2025

హైదరాబాద్ లో భారీ వర్షం… రోడ్లన్నీ జలమయం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీబ్యూరో: హైదరాబాద్ నగరంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి వర్షం భారీగా కురిసింది. సుమారు ఒక గంటపాటు వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి.  పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, బేగంపేట, అమీర్ పేట, సికింద్రాబాద్, కూకట్ పల్లి, రాయదుర్గ, ఉప్పల్, ఎల్ బినగర్, దిల్ సుఖ్ నగర్, కోఠి, నారాయణ గూడ పలు ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. దీంతో రాయదుర్గం, జూబ్లీహిల్స్ బంజారాహిల్ష్, పంజాగుట్ట  ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

తెలంగాణలో మరో ఐదు రోజుల తేలికపాటి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని హైదరాబాద్ వాతావరణ వాఖ తెలిపింది. గంటకు 40 కిలో మీటర్ల నుంచి 50 కిలో మీటర్ల వేగంతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణలో ఆగ్నేయ దిశగా గాలులు వీయడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతంలో ఆవర్తనం సముద్ర మట్టానికి 0.9 కిలో ఎత్తులో ఉందని వివరించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News