- Advertisement -
హైదరాబాద్: నేడు, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హైదరాబాద్ తెలిపింది. ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో వానలు పడుతున్నాయి. రాగల రెండు రోజుల్లో తెలంగాణ వివిధ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. బలమైన గాలులతో పాటు ఓ మోస్తరు నుంచి భారీ వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లో అలెర్ట్ రేపటి వరకే వర్తించేదయినప్పటికీ నగరంలో వానలు ఆగస్టు 10 వరకు కొనసాగే అవకాశం ఉందంది. ఇప్పటి వరకు నైరుతి రుతుపవనాల వల్ల తెలంగాణలో 487.6 ఎంఎం వర్షపాతం నమోదయింది. సాధారణంగా అయితే 401.8 ఎంఎం ఉంటుంది. కాగా హైదరాబాద్ లో వర్షపాతం ఇప్పటి వరకు 295.1 ఎంఎం నమోదయింది. సాధారణంగా అయితే 313 ఎంఎం పడుతుంది. అంటే 6 శాతం తేడా గా ఉంది.
- Advertisement -