హైదరాబాద్ నగరం భారీ వర్షంతో విలవిలలాడింది. ఎడతెరిపిలేని కుంభవృష్టి వర్షంతో మరోసారి నీట మునిగింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారు జామున వరకు కురిసిన భారీ వర్షంతో నగరం నదులను తలపించింది. అదే ప్రాంతం ఉంచు మించుగా అంతే వర్షం కురువడంతో పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైయ్యాయి. అనేక ప్రాంతాల్లో 5 నుంచి 9.సెమి. పైగా వర్షం కురిసింది. ఎల్‌బినగర్ నియోజకవర్గంలో దాదాపుగా 70 శాతం కాలనీలు, బస్తీలు జలదిగ్భంధనంలో చిక్కుకున్నాయి. వర్షం కారణంగా మరో వైపు విద్యుత్‌ను సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో ఈ ప్రాంతాలన్ని గంటల తరబడి అంధకారంలో ఉన్నాయి. ఒకవైపు భీకర వర్షం మరో వైపు వరద ఉధృతి అంతకు అంత పెరిగిపోవడంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నడుము లోతుకు మించి వరద నీరు చే రడంతో చీమ చీకట్లో వరద నీటిలో గడిపారు. తెల్లవారు జామున వర్షం తగ్గుముఖం పట్టిన వరదలు మాత్రం గురువారం సాయంత్రానికి కూడా తగ్గలేదు.
భారీ వర్షంతో హైదరాబాద్ విలవిల…..
- Advertisement -
- Advertisement -
- Advertisement -