- Advertisement -
- రహదారిపై విరిగి పడిన చెట్లు, నేల కూలిన విద్యుత్ స్తంభాలు
కీసరః మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షానికి రహదారుల గుండా ఉన్న చెట్లు విరిగి పడ్డాయి. కీసర నుండి ఈసీఐఎల్, కీసరగుట్ట రహదారులపై, చీర్యాల్ నుడి యాద్గార్‌పల్లి రోడ్డులో చెట్లు విరిగి పడటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి.
రోడ్లపై వరదనీరు చేరి వాహన దారులు అవస్థలు పడ్డారు. పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి రోడ్లపై విరిగి పడ్డ చెట్లను తొలగించారు. పలు గ్రామాలలో విద్యుత్ స్తంభాలు నేల కూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అధికారులు, సిబ్బంది తిరిగి విద్యుత్ సరఫరాను పునరుద్ద్ధరించారు. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షంతో కొంత ఉపశమనం కలిగింది.
- Advertisement -