Tuesday, April 1, 2025

హైద‌రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం

- Advertisement -
- Advertisement -

Heavy rain in many parts of Hyderabad

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం నాడు మ‌ధ్యాహ్నం భారీ వ‌ర్షం పడింది. ఉద‌యం కొంచెం ఎండ‌, చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణం ఏర్ప‌డిన హైద‌రాబాద్‌లో మ‌ధ్యాహ్నం అయ్యేసరికి వర్షం దంచికొట్టింది. పలు చోట్ల వ‌ర్ష‌పు నీరు ర‌హ‌దారుల‌పై నిలిచిపోవ‌డంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది క‌లిగింది. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. గత వారం రోజుల నుంచి తెలంగాణవ్యాప్తంగా వ‌ర్షాలు కురిసున్న ముచ్చట తెలిసిందే. అటు జిల్లాలో మహబూబ్ నగర్, సిద్దిపేట‌, సిరిసిల్ల‌, నిజామాబాద్, నిర్మ‌ల్, కామారెడ్డి, జ‌న‌గామ‌, యాదాద్రి భువ‌న‌గిరి, వ‌రంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మంచిర్యాల జిల్లాల్లో వ‌ర్షాలు జోరుగా కురుస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News