Monday, December 23, 2024

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురుస్తోంది. పాతబస్తీ, చార్మినార్, బహదూర్ పురా, యాకుత్ పురా, చంద్రాయణగుట్ట, బార్కస్, ఫలక్ నుమా, కోఠి , అబిడ్స్, బేగంబజార్, నాంపల్లి, బషీర్ బాగ్, లక్డీకాపూల్, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, బోరబండ, మోతినగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్, మధురానగర్, యూసుఫ్ గూడ, అమీర్ పేట్, ఎస్ ఆర్ నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఆసిఫ్ నగర్, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొడుతోంది. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడ ఆగిపోయాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేేరింది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భారీగా వర్షం కురవడంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News