Thursday, November 14, 2024

రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం

- Advertisement -
- Advertisement -

Heavy rain in many parts of Telangana

హైదరాబాద్‌లో ట్రాఫిక్ జాం
సంగారెడ్డిలో 93.3 మిల్లీమీటర్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : నేడు, రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో వాగులు, వంకలు పొంగిప్రవహించాయి. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం అయ్యింది. జిహెచ్‌ఎంసి పరిధిలోని చందానగర్‌లో 60 మిల్లీమీటర్లు, జూబ్లీహిల్స్‌లో 45.5, మెహిదీపట్నంలో 42.3, గోషామహాల్‌లో 33, సంతోష్‌నగర్‌లో 21.8, మలక్‌పేటలో 20.3, కార్వాన్‌లో 15.3, చార్మినార్‌లో 12.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని, క్యుములో నింబస్ మేఘాల కారణంగా వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం

రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం పలు ప్రాంతాల్లో కురిసిన వర్షం తాలుకు వివరాలు ఇలా ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌లో 59.8 మిల్లీమీటర్లు, సూర్యాపేటలో 54.3, మహబూబాబాద్‌లో 50.5, మంచిర్యాలలో 42.8, ఆదిలాబాద్‌లో 36.5, నల్లగొండలో 35, నిజామాబాద్‌లో 30.3, సంగారెడ్డిలో 93.3, ఖమ్మంలో 25.3, రంగారెడ్డిలో 60, హైదరాబాద్‌లో 45 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News