రెండోరోజు అదే పరిస్థితి కూడా అదే పరిస్థితి
మరో 48 గంటల పాటు వర్షం
హెచ్చరించిన వాతావరణ శాఖ
హైదరాబాద్: అల్పపీడనం కారంణంగా నగరంలో రెండు రోజులుగా కురుసున్న వర్షాలతో నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరంలో గత రెండు రోజులుగా నాల్గు రోజులుగా కురుస్తున్న వానలపై జిల్లా యంత్రంగా అప్రమత్తమైంది.మంగళవారం రాత్రి నుంచి బుదవారం సాయంత్రం 4.30 వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. దీంతోఆర్టీసీ క్రాస్ రోడ్స్, విద్యానగర్, ఖైరతాబాద్, లక్డికాపూల్,బషీర్‌బాగ్, నారాయణగూడ, కోఠీ, దిల్‌షుక్ నగర్, కొత్తపేట, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, హాయత్‌నగర్, పరిసర ప్రాంతాల్లో కురివడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉండే నివాసాల్లోకి నీరు చేరడంతో ఆ ప్రాంత ప్రజలు వాన నీటిని బయటకు ఎత్తిపోస్తు అనేక ఇబ్బందులు పడుతున్నారు.వానకాలం సందర్భంగా మున్సిపల్ సిబ్బంది మ్యాన్ హోల్స్‌ను శుభ్రం చేయక పొవడంతో వాన నీరు రోడ్లపైనే నిలిచిపోయి రోడ్లన్ని చెరువులను తలపించాయి.
నగరంలో కురిసి వర్షం కారణంగా అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయక పోవడంతో ట్రాఫిక్ పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయక పోవడంతో వాహనాల దారులు ఇష్టం వచ్చిన విధంగా వాహనాలు డ్రైవ్ చేయడంతో మరింత ట్రాఫిక్ సమస్యలు ఏర్పాడ్డాయి.ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయాలన్సి అధికారులు ఎక్కడ కనిపించక పోవడంతో కనిపించ పోవడంతో వాహన దారులు అసహనానికి గురి అయ్యారు.సాయంత్రం సమయంలో వర్షం కురవడంతో కార్యాలయాల నుంచి ఇళ్ళకు వెళ్ళే వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.వరుణడి దెబ్బకు వానాల స్పీడ్‌కు కూడా బ్రేక్ పడింది.
నగర రహదారుల్లో సాధారణంగా గంటకు 40 కిలో మీటర్ల వేగంతో వాహనాలు ఒక వైపు భారీ వర్షం, మరో వైపు ట్రాఫిక్ జామ్‌తో వాటి స్పీడ్ గంటకు 5 నుంచి 10 కిలో మీటర్లకు మాత్రమే పరిమితమైంది. ముఖ్యంగా ప్రధానంగా కోటీ, ఆబిడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్,జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎల్పీనగర్, దిల్‌షుక్ నగర్ తదితర ప్రాంతాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. వర్షాలకు తోడు ఆయా ప్రాంతాల్లో భారీ ఎత్తును వాహనాల సైలెన్సర్ ద్వారా నీరు ఇంజన్‌లోపలకు వెళ్ళి వాహన దారులను ముప్పు తిప్పలు పెట్టాయి. అంతే కాకుండా నగరంలో పలు ప్రాంతాల్లో మెట్రో ఫై ఓవర్ల కింద ద్విచక్ర వాహనదారులు తమ వాహనాలను నిలిచి వుండటంతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
మరో48 గంటల్లో భారీ వర్షం….
రాష్ట్ర వ్యాప్తంగా మరో 48 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. నగరంలో బుధవారం తెల్లవారుజాము నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉప్పల్ , అల్వాల్, రాజేంద్రనగర్, కార్వాన్ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల వరకు 0.5 మిల్లీ మీటర్ల నుంచి 2 మిల్లి మీటర్ల వర్షాపాతం నమోదైంది. బాజుపల్లిలో ఉదయం 10 గంటలకు భారీ వర్షం కురిసింది. నిన్నటివరకు నగరంలో 70 శాతం అధికంగా వర్షాపాత నమోదైనట్లు డెవలప్‌మెంట్ ప్లానింగ్ సోసైటీ అధికారులు తెలిపారు.