Thursday, April 3, 2025

ఉత్తర భారతంలో భారీ వర్షాలు: 14 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఉత్తర భారతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భార వర్షాల ధాటికి ఇప్పటి వరకు 14 మంది మృతి చెందారు. వాగులు వంకల, నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తుండడంతో బ్రిడ్జిలు, కార్లు, వాహనాలు వరదలలో కొట్టుకొనిపోయాయి.  హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు కురవడంతో వాగు వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఏడు జిల్లాలో రెడ్ అలెర్ట్ అధికారుల ప్రకటించారు. కొన్ని పదేశాలలో కొండచరియలు విరిగిపడుతున్నాయి.

Also Read: పార్టీలు మారడం బట్టలు మార్చినంత ఈజీ కాదు: ఈటల రాజేందర్

రోడ్డు కొట్టుకొనిపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడడంతో ఇండ్లు నేలమట్టమయ్యాయి. రూ.362 కోట్ల నష్టం వాటిల్లినట్లు విపత్తు నిర్వహణశాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తరాఖండ రాష్ట్రం తెహ్రీ జిల్లాలో నదిలో వాహనం పడడంతో ఒకరు మృతి చెందారు. మృతుడు విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం వాసి రవిరావుగా గుర్తించారు. రోడ్డుపైన కొండచరియలు విరిగిపడుతుండడంతో తప్పించబోయి వాహనం నదిలో పడిపోయింది. దీంతో రెస్కూ సిబ్బంది వాహనంలో ఉన్న ఐదుగురిని కాపాడారు. మరో ఐదుగురు గల్లంతు కావడంతో వారి కోసం విపత్తు నిర్వహణ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News