- Advertisement -
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున జగిత్యాల, కోరుట్ల, హుజురాబాద్, జమ్మికుంటలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం ఎకధాటిగా పడింది. దీంతో వరద నీటిలో కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం కొట్టుకుపోయింది. కొన్నిచోట్ల తార్ఫిన్లు లేక వరి ధాన్యం తడిసి ముద్దయింది. మరికొన్ని ప్రాంతాల్లో మామిడి కాయలు నేలరాలాయి. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతోపాటు పలువురు ప్రాణాలు కోల్పోయారు.
Heavy Rain in Several Areas in Karimnagar
- Advertisement -