Thursday, January 23, 2025

రేపటి నుంచి భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్
బంగాళాఖాతంలో మరో
అల్పపీడనం ఏర్పడే అవకాశం

మన తెలంగాణ: రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబా ద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే విధంగా ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దక్షిణ ఒ డిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయు వ్య బంగాళాఖాతం పరిసరాల్లో పశ్చిమ మ ధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఈ నెల 25,26 తేదీలలో భారీ నుం చి అతి భారీ  వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రెండు రోజులు రాష్ట్రానికి ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది.

రాగల 5రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు ,మెరుపులతోపాటు ఈదురుగాలులు వీస్తాయని,గాలి వేగం గంటకు 30నుండి 40కిలోమీటర్ల వేగంతో ఉంటుందని తెలిపింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అదిలాబాద్ జిల్లా తాంసిలో 37.3 మి.మి , అదిలాబాద్ అర్బన్‌లో 37 మి. మి. వర్షం కురిసింది.రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో మహమ్మదాబాద్‌లో 31, రావినూతలలో 31, తలమడుగులో 28.8, సిర్పూర్‌లో 28.3, మచ్చా బోల్లారంలో 28, ఉట్నూర్‌లో 27.3, భద్రాచలంలో 26, సల్కార్‌పేటలో 24.5, గుండాలలో 22.8, లింగాపూర్ 21, గంగారంలో 21, బనాపురంలో 21, కన్నాయిగూడెంలో 19, ఇల్లెందులో 19.5, దుమ్ముగూడెంలో 19 మి.మి చొప్పున వర్షం కురిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News