Monday, December 23, 2024

తిరుమల కొండపై భారీవర్షం

- Advertisement -
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల కొండపైన వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. గురువారం భారీ వర్షం కురిసింది. గత వారంరోజులుగా భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలతో ఉక్కపోతకు గురవుతూ వచ్చిన వెంకన్న భక్తులు చల్లటి వాతావరణంలో హాయిగా సేదదీరారు. వేసవి సెలవులు ఇవ్వటంతో ప్రతి సంవత్సరం మే మొదటి వారంలో వెంకన్న దర్శనం కోసం వివిధ రాష్ట్రాలనుంచి తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. వరుస సెలవులు వచ్చినప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ పెద్దగా పెరగలేదు.

ఇక తిరుమలకి వెళ్ళిన భక్తులు కూడా ఎండల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో తిరుమలలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కొండపైన వర్షం దంచికొట్టింది. అరగంటసేపు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ఒక్కసారిగా తిరుమల పుణ్యక్షేత్రం చల్లగా మారిపోయింది. చల్లటి గాలులతో, ఆహ్లాదకర వాతావరణంలో భక్తులు హాయిగా సేదదీరారు. కేవలం తిరుమల కొండపైనే ఈ వర్షం కురిసింది. తిరుమలలో ఎండ తీవ్రతను తట్టుకోలేక పోతున్న భక్తుల కోసమే అన్నట్టు వర్షం కురవడంతో భక్తులు ఇదంతా ఏడుకొండల వాడి మహిమ అంటున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులు కాసింత సేద తీరేలా ఆ వెంకటేశ్వర స్వామి వర్షం కురిపించాడని సంబరపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News