Sunday, January 19, 2025

తడిసి ముద్దయిన ఉప్పల్ స్టేడియం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం తడిసి ముద్దయింది. దీంతో బుధవారం ఉప్పల్ వేదికగా హైదరాబాద్‌లక్నో జట్ల మధ్య మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షంతో స్టేడియం మొత్తం చిత్తడిగా తయారైంది. పిచ్ కూడా దెబ్బతిన్నట్టు తెలిసింది. మైదానం మొత్తం చిత్తడిగా మారడంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే సందేహం నెలకొంది. బుధవారం కూడా వర్షం పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అదే జరిగితే బుధవారం మ్యాచ్ జరగడం కష్టమేనని చెప్పాలి. కాగా, మంగళవారం సాయంత్రం లక్నో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో వర్షం మొదలైంది. చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం తర్వాత కుండపోతగా మారడంతో స్టేడియం మొత్తం చిత్తడిగా మారిపోయింది. వర్షం నేపథ్యంలో గ్రౌండ్ అంతటా కవర్స్ కప్పి ఉంచారు. బుధవారం వర్షం కురువక పోతే మాత్రం మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా సాగే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News