Monday, December 23, 2024

పరిగిలో పొంగిపొర్లుతున్న వాగులువంకలు….

- Advertisement -
- Advertisement -

 స్తంభించిన పరిగి టూ మహబూబ్ నగర్ రాకపోకలు….

పరిగి: వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరిగి పట్టణంలో భారీ కుండపోత వర్షం కురవడంతో వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో పట్టణంలోని రహదారులన్నీ జలమయంగా మారాయి. దోమ మండల పరిధిలోని గొడుగొనిపల్లి గ్రామ అంచున ఉన్న పెద్ద వాగు నిండుకుండలా పొంగిపొర్లుతుంది. వాగు నుంచి సుమారు 100 మీటర్ల పొడవు వరకు పంట పొలాల్లో నుంచి భారీ వరదగా ప్రవహిస్తుంది. పరిగి-మహబూబ్ నగర్ రాకపోకలు స్తంభించాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. ప్రవహిస్తున్న వాగు పైనుంచి ప్రయాణికులు రాకపోకలు ఆపేయడం మంచిదని గ్రామస్థులు సూచనలు ఇస్తున్నారు. అల్లాపూర్ చెరువు పొంగిపొర్లడంతో అల్లాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News