Thursday, January 23, 2025

చెన్నైలో భారీ వర్షం..స్కూళ్లకు నేడు సెలవు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై మహానగరంతోపాటు శివారు ప్రాంతాలలో సోమవారం ఉదయం భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షం కారణంగా అంతర్జాతీయ విమానాశ్రంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దోహ, దుబాయ్‌తోసహా ఇక్కడకు వచ్చే 10 అందర్జాతీయ విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. అదేవిధంగా ఇక్కడ నుంచి బయల్దేరాల్సిన విమానాల సర్వీసులు రద్దయ్యాయి.

గత కొద్ది రోజులుగా సూర్యుడి ప్రతాపానికి అల్లాడుతున్న చెన్నైవాసులకు ఈ భారీ వర్షం ఊరటనిచ్చింది. నగరంతోపాటు పొరుగున్న ఉన్న చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువల్లూరు, వెల్లూరు, రాణిపేట్ జిల్లాలలో సైతం భారీ వర్షం కురవడంతో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. చెన్నైతోపాటు పరిసర ప్రాంతాలలో సోమవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News