- Advertisement -
బెంగళూరు : భారీ వర్షాలతో బెంగళూరు అతలాకుతలం అయింది. తుపాన్ ప్రభావంతో బుధవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ కురిసిన భారీ వర్షాలతో నగరంలో జనజీవనం అస్థవ్యస్థం అయింది. పలు చోట్ల కాలనీలు, వీధులు జలమయం అయ్యాయి. నగరంలో ఓ చోట మెట్రోరైలు మార్గపు కాంపౌండ్ వాల్ కుప్పకూలింది. దీనితో సమీపంలో పార్క్ చేసిన పలు కార్లు , ఇతర వాహనాలు దెబ్బతిన్నాయి. మొత్తం మీద 70 ఎంఎంల వర్షపాతం నమోదైంది. అయితే పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడ్డాయి. గురువారం ఉదయం వరకూ కూడా పరిస్థితి కొలిక్కిరాలేదు. పలు ప్రాంతాల్లో వర్ష ప్రభావంతో తలెత్తిన పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. పలు చోట్ల చెట్లు కూలాయి. నగరంలోని శేషాద్రిపురంలో వర్షప్రభావం తీవ్రంగా ఉంది. దిషా సెంట్రాలోని రాదారి వాననీటితో నదిలా మారింది.
- Advertisement -