- Advertisement -
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఉదయం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో ఢిల్లీలోని కొన్ని లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. దీంతో ఢిల్లీ ప్రధాన రహదారులన్నీ జలమయమైనాయి. భారీగా నీరు రోడ్డుపై చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురైనారు. మరో రెండు రోజులు ఢిల్లీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం ఐఎండి తెలిపింది.అత్యవసర పరిస్థితులుంటే తప్ప ప్రజలు బయటకు రాకూడదని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఢిల్లీలో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
- Advertisement -