Sunday, February 2, 2025

వర్షం ముప్పు.. మహారాష్ట్రకు రెట్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి

- Advertisement -
- Advertisement -

ముంబై: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని ముంబైలోనూ భారీగా వర్షం పడుతోంది. భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతారణ శాఖ(ఐఎండి) హెచ్చరికలు జారీ చేసింది. పాల్ఘర్, రాయ్‌గడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్.. థానే, ముంబై, రత్నగిరికి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. వర్షం హెచ్చరికలతో రాయ్‌గడ్ జిల్లా పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు.

ఇదిలా ఉంటే, దేశరాజదాని ఢిల్లీలో మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో యమునా నది నీటిమట్టం పెరుగుతోంది. ఢిల్లీ నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. తీవ్ర వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News