- పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు
- పలు చోట్ల నిలిచిన రాకపోకలు
తూప్రాన్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం పవల్ల ఆదివారం నాటి నుండి కురుస్తున్న వర్షాలతో జనజీవనం అతలాకుతలమైంది. చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మండల పరిధిలోని యావాపూర్, అబోతుపల్లి శివారులలో ఉన్న చెక్ డ్యాంలు మళ్లీ కాజువే బ్రిడ్జిలపై నుండి పొంగి పొర్లుతున్నాయి. దీంతో ఆ మార్గంలో ప్రజల రాకపోకలు స్తంభించాయి.
వానలకు మంగళవారం వరకు 8 పెంకుటిండ్లు దెబ్బతిన్నా యి. ఇస్లాంపూర్‌లో 4, వెంకటాయపల్లిలో 2, నాగులపల్లిలో 1 ఇళ్లు పాక్షికంగా కూలిపోయాయి. వర్షాలతో వేసుకున్న పంటలపై రైతులకు ఎంతో ఊరట నిచ్చినట్టయింది. గత నెల రోజుల క్రితం తెరిపిలేకుండా కురిసి ఆ తర్వాత మొఖం చాటేసిన వానలు విపరీతమైన ఎం డలతో అటు పంటలను, తీవ్రమైన ఉక్కపోతలతో ఇటు ప్రజలను ఇబ్బందులకు గురిచేసిన వానాకాలం సీజన్ పై ఆందోళన పడుతున్న తరుణఁలో అనుకోకుఁడా ఆ కాశమంతా మేఘావృతమై ఆదివారం తెల్లవారుజాము నుండి ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తుండడంతో రైతులు సంతోష పడుతున్నారు.
ఈ సీజన్‌లో రైతులు వేసుకున్న పంటలకు నీరందక ఎండలకు వాడిపోతున్న దశకు చేరుకున్న వరి, మొక్కజొన్న, కంది, పత్తి మొదలగు వర్షాధార పంటలతో పాటు టమాట, చిక్కుడు, బెండ, బీర, వంకాయ తదీతర కూరగాయ పంటలకు మంచి అదునులో ప్రాణం పోసినట్లు అయి ంది. మరోవైపు వాతావరణం ఒక్కసారిగా చల్లబడడం తో ప్రజలు ఉక్కపోత బాధ నుంచి ఉపశమనం పొం దారు. అయితే వర్షానికి దాతర్‌పల్లి శివారులో గల ఒక కుంట తూముకు గండి పడి నీళ్ళన్నీ వృధాగా బయట కి పోతున్నాయని గ్రామస్తులు తెలిపారు.
అకాల వర్షాలకు మళ్లీ గ్రామీణ రోడ్లు గుంతలు, బురలతో అధ్వానంగా తయారయ్యాయి. ముఖ్యంగా తూప్రాన్ పట్టణంలో పలు కాలనీలు మట్టి రోడ్లను తలపిస్తున్నాయి. అడుగడుగునా గుంతలతో నడవడానికి కూడా వీలులేకుండా మారాయి. ప్రత్యేక నిధులు సిద్దంగా ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు, పాలకవర్గ సభ్యుల నిర్లక్షం వల్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో గల్లీ రోడ్లకు ఈ దుస్థితి దాపురించిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.