ముగ్గురు మృతి, అనేక మంది గల్లంతు
తిరువనంతపురం: కేరళలో శనివారం కురిసిన భారీ వర్షం ఐదు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. అనేకచోట్ల వాన నీరు వరదై పారుతోంది. వీడియోలు తీవ్రతను తెలుపుతున్నాయి. కేరళ రాష్ట్ర ప్రభుత్వం సాయం కోరికపైన వాయుసేన రంగంలోకి దిగింది. కొట్టాయం గ్రామ ప్రాంతాలు జలమయమయ్యాయి.
పథనంథిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కీ, త్రిస్సూర్ జిల్లాల్లో ‘రెడ్ అలర్ట్’ ప్రకటించారు. కాగా తిరువనంతపురం, కొల్లం, అలప్పుళ, పాలక్కాడ్, మలప్పురం, కొజికోడ్, వాయ్‌నాడ్ జిల్లాల్లో ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించారు. మరో రెండు జిల్లాల్లో ‘ఎల్లో అలర్ట్’ ప్రకటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ హెచ్చరిక నోటీసు జారీ చేశారు. కొండలు, నదీ ప్రాంతాల్లో పర్యటించకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు.
The Kerala government has sought the assistance of the Indian Air Force for rescue operations in the state, where landslides have occurred following heavy rains, and few people are reported missing in Kottayam. pic.twitter.com/dz4onY0ErY
— News18 (@CNNnews18) October 16, 2021