Monday, December 23, 2024

ఉత్తరాదిని కుదిపేస్తున్న వర్షాలు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : నైరుతి రుతుపవానాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, గోవా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనానికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని చోట్ల మరణాలు సంభవించాయి. హర్యానా లోని గురుగ్రామ్‌లో గురువారం ఉదయం నుంచి కుండపోతలా వర్షం కురుస్తోంది. ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపై నిల్చిన నీటిని పంపుల ద్వారా తోడి బయటకు పంపుతున్నారు. మహారాష్ట్రలో గత రెండు రోజులుగా భారీ వర్షాలకు వరద ముంచెత్తుతోంది. గత 24 గంటల్లో థానే, పాల్ఘర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. చెట్లు కూలాయి. పోటెత్తిన వరదల్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయినట్టు అధికారులు తెలిపారు. వారిలో ఒకరి మృతదేహం లభ్యం కాగా, మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఆ రాష్ట్రం లో దాదాపు 100కు పైగా రహదారులను మూసివేసినట్టు అధికారులు చెప్పారు. ఉత్తరాఖండ్‌లో జులై 5 వరకు కుండపోతలా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. బద్రీనాథ్ రూట్లో కొండచరియలు విరిగిపడి చిక్కుకున్న టూరిస్టులు ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో చిన్కా వద్ద జాతీయ రహదారిపై కొండచరియలు విరిగి పడడంతో బదిరీనాథ్ యాత్రికులు వందలాది మంది చిక్కుకున్నారు.

వీరంతా బద్రీనాథ్, హేమకుండ్ సాహిబ్ క్షేత్రాలకు వెళ్ల వలసి ఉంది. ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్ చేశారు. భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి హెచ్చరించింది. శిధిలాలను వీలైనంత తొలగించి యాత్రికులను రక్షించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News