Wednesday, January 22, 2025

ముంచెత్తిన వాన

- Advertisement -
- Advertisement -

 

Heavy Rained in Hyderabad

మన తెలంగాణ/హైదరాబాద్ : కుండ పోత వర్షం నగరాన్ని మరోసారి ముంచెత్తింది. శనివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. రెండు గంటల పాటు వర్షం దంచికొట్టడంలో నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ఒకవైపు కుంభ వృష్టి వర్షం మరోవైపు వాతావరణ శాఖ నగరంలో హై అలర్డ్‌ను ప్రకటించడంతో నగరవాసులు వణికి పోయారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గడిచిన 4 రోజులుగా నరగంలో వర్షం కురుస్తునే ఉంది. శనివారం ఏకంగా గంట వ్యవధిలోనే పలు ప్రాంతాల్లో 5 నుంచి 7 సె.మి.లకు పైగా వర్షం కురువడంతో రాత్రి 9 గంటల లోపే పలు ప్రాంతాల్లో 10 నుంచి 12 సె.మి. వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాలు పూర్తిగా జలదిగ్భంధనంలో చిక్కున్నాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే నిలిచిపోయింది. దీంతో గంటల తరబడి రోడ్లపైనే చిక్కుకున్న వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో నడుంలోతుకు మించి నీరు చేరడంతో వేళ్లేందుకు దారి లేక ద్విచక్రవాహనదారులు వరద నీరు తగ్గేంతవరకు రోడ్లపైనే పడిగాపులు కాశారు.

భారీ వర్షంతో మెట్రో స్టేషన్లన్ని ప్రయాణికులతో కిటకిటలాడాయి. మరోవైపు కుండపోత వర్షంతో లొతట్టు ప్రాంతాలన్ని నీట మునుగడంతో పాటు ఇళ్లు అపార్టమెంట్ సెల్లార్లకు వరద నీరు చేరడంతో అష్టకష్టాలు పడ్డారు. శనివారం ం సాయంత్రం మొదలైన ఏకదాటిగా కొనసాగింది.భారీ వర్షం కురువడంతో కాల్వలు, డ్రైనేజీలు పొంగిపోర్లుతు రోడ్లను లొతట్టు ప్రాంతాలను ముంచేత్తాయి. మరో వైపు భారీ వర్షానికి పెద్ద పెద్ద వృక్షాలు నేలకూలడంతో విద్యుత్ స్థంభాలు, తీగలు తెగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడడంతో చీకట్లు అలుముకున్నాయి. వర్షకాలం ప్రారంభం మొదలు నగరంలో ప్రతి నెల వారం 10 రోజులు వరసగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నగరంలోని అన్ని చెరువులు, కుంటలు పూర్తిగా నిండుకుండలను తలపిస్తున్నాయి. చిన్నపాటి వర్షాలకు కూడ అన్ని చెరువులు, కుంటు మత్తడి దుంకుతుండడంతో నపరిసర ప్రాంతాల్లో కాలనీలు, బస్తీల వాసులు వర్షం పడితే చాలు వణికి పోతున్నారు. శనివారం కురిసిన భారీ వర్షానికి పలు చెరువులు, కుంటలు అలుగు పారడంతో వందలాది బస్తీలు, కాలనీలు నీటి మునిగాయి.

మూడు జోన్లలోకుండపోత వర్షం 

గ్రేటర్‌లోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఖైరతాబాద్ జోన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో ఈ మూడు జోన్లలోని పలు సర్కిళ్లలో జనజీవనం పూర్తిగా స్తంభించి పోయింది. కేవలం రెండు గంటల వ్యవధిలోనే పలు సర్కిళ్లలో కుంభ వృష్టి వర్షం కురిసింది. జూబ్లీహిల్స్ సర్కిల్‌లోని రాత్రి 9 గంటల వరకే షేక్‌పేట్‌లో 12 సె.మి. వర్షపాతం నమోదైంది. చందానగర్ సర్కిల్ పరిధిలోని కాకతీయ హిల్స్‌లో 11 సె.మి.వర్షం కురిసింది. అదేవిధంగా జూబ్లీహిల్స్‌లో 10.6 సె.మి. కూకట్‌పల్లి సర్కిల్‌లోని హెచ్‌ఎండి హిల్స్‌లో సైతం 10.6 సె.మి. వర్షం కురిసింది. అదేవిధంగా మాదాపూర్‌లో 9.5, ఖాజాగూడ స్పోర్ట్ కాంప్లెక్స్ 9.5, మియాపూర్ 8.1, కెపిహెచ్‌బి 7.9, హఫీజ్‌పేట్ 6 సె.మి. అత్తాపూర్ 5.8, రాయదుర్గ్ 7.3, ఎంసిహెచ్‌ఆర్‌డి 7 సె.మి, .వర్షం పడింది. అదేవిధంగా బాలానగర్ 6.8, వివేకానందనగర్‌లో 6.2 సె.మి.వర్షం పడిండి అదేవిధంగా టోలిచౌకి, వివేకానందనగర్, కుత్భుల్లాపూర్, మోతినగర్, గాజులు రామారం, ఫీరోజ్‌గూడ, ఆసీఫ్ నగర్ మైత్రివనం, గోల్కోండ, ఫతేనగర్, బంజారాహిల్స్, రామచంద్రాపురం, రాజేంద్రనగర్, గచ్చిబౌలి, జీడిమెట్ల, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం, శాస్త్రిపురం, లింగంపల్లి, ఖైరతాబాద్, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో 1 సెమి. నుంచి 5 సె.మి.లోపు వర్షపాతంనమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News