ముంబై : దేశ వాణిజ్య రాజధాని ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి నుంచి కురిసిన వర్షానికి నగరం జలమయమైంది. లోతట్టు ప్రాంతాలు మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ముంబై నగరంలో 95.81 మిల్లీమీటర్ల కు పైగా వర్షపాతం నమోదైంది. పట్టాలపై నీరు నిల్వడంతో పలు చోట్ల లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. రహదార్ల పైకి నీరు భారీగా చేరడంతో ముంబై లోని 8 మార్గాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. ముంబైతోపాటు ఠాణే, పాల్ఘర్, పుణెల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఠాణేలో సోమవారం ఉదయం నుంచి ఈ ఉదయం వరకు 146 మిమీ వర్షం కురిసింది. పాల్ఘర్‌లో ఓ ఇల్లు కూలింది. కల్యాణ్, భీపండి ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అమరావతి జిల్లాలో వీధులు నదులను తలపిస్తున్నాయి. రాయగఢ్ జిల్లా లోని కుండలీకా నది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. ఘాట్కోపర్ ప్రాంతంలో భారీ వర్షానికి కొండచరియలు విరిగి పడ్డాయి. స్థానిక అధికారులు , రెస్కూ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.
ముంబైకి భారీ వర్ష సూచన
- Advertisement -
- Advertisement -
- Advertisement -