Sunday, December 22, 2024

పెద్దవాగుకు గండ్లు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/అశ్వారావుపేట రూరల్/దమ్మపేట: గురువారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షానికి భద్రాది కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిప్రవహించడంతో పెద్దవాగు ప్రా జెక్టుకు వరద పోటెత్తింది. ఉధృతంగా ప్రవహిస్తు న్న పెద్దవాగు వరద ఉధృతిని గురువారం ఎమ్మె ల్యే జారే ఆదినారాయణ, పోలవరం ఎమ్మెల్యే, ఎ స్పీ రోహిత్‌రాజులు పరిశీలించారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యేలు, ఎస్పీ పలు సూచనలు చేశారు. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లో వాగులను దాటే ప్రభు త్వం చేయొద్దని పేర్కొన్నారు.

వరదలో చిక్కుక్కున్న కూలీలు
పెద్దవాగు ప్రాజెక్టు పూర్తిగానిండి వరద ఉదృతం గా ప్రవహించటంతో రహదారిపైకి నీరు ప్రవహించడంతో అశ్వారావుపేట మండలం నారాయణపురం వాగుపై ఆటోలో ప్రయాణీస్తున్న కూ లీలు 28 మంది వరదలో చిక్కుకున్నారు. వీరిని కాపాడేందుకు హెలికాఫ్టర్ ద్వారా ప్రయత్నాలు చేశారు. దీంతో ఎన్‌డిఆర్‌ఎఫ్, డిఆర్‌ఎఫ్ బృందా లు రంగంలోకి దిగాయి. రైతులందరినీ సురక్షితంగా గ్రామాలకు తరలించాయి. భారీ వర్షాల వలన చెరువులు, కుంటలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలని అందుకు తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.అశ్వారావుపేట – వేలేరుపాడు మార్గంలో వరద ఉదృతికి కారు కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ప్రయాణీకులను గ్రామస్థులు సురక్షితంగా కాపాడారు. కాగా దమ్మపేట

మండల పరిధిలోని జమేదారు బంజర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొం ది. బుధవారం రాత్రి నుండి పడుతున్న భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎర్రన్నపేట గ్రామ శివారులో ఉన్న వారి పొలం దగ్గరికి వెళ్లిన అన్నాదమ్ములు పిడుగుపాటుకు బలయ్యారు. జమేదారు బంజర గ్రామానికి చెందిన బుర్ర చందు (15), సిద్దు (13) అనే ఇద్దరు అన్నదమ్ములు తల్లిదండ్రులతో పొలం వద్దకు వెళ్లగా అదే సమయంలో వారిపై పిడుగు పడడంతో ఇద్దరు షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. పిడుగుపాటుకు గురై మృతి చెందిన చిన్నారులను స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ వారి స్వగృహానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News