బ్రెసిలియా: బ్రెజిల్ ఆగ్నేయ ప్రాంతంలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు, కొండచరియలు విరిగిపడ్డాలు సంభవించడంతో కనీసం 36 మంది చనిపోయారు. వందలాది మంది నిర్వాసితులయ్యారని ఫిబ్రవరి 19న సావో పాలో రాష్ట్ర అధికారులు తెలిపారు. బాధితుల కోసం రెస్కూ వర్కర్లు వెతుకుతున్నారు. కొన్ని రోడ్లను తిరిగి పునరుద్ధరించారు. బ్రెజిల్ కార్నివల్ వేడుకల్లో పాల్గొన్న అనేకమంది పర్యాటకులు ఇప్పటికీ చిక్కుకుపోయి ఉన్నారు. సావో పాలో తీర ప్రాంతంలో భారీ వర్షం కొనసాగగలదని వాతావరణ శాఖ హెచ్చరించింది. రెస్కూ టీమ్‌లకు పరిస్థితి ఛాలేంజిగా మారింది. మరణాల సంఖ్య ఇంకా పెరుగవచ్చని కూడా భావిస్తున్నారు.
బాధితులకు సాయమందించాల్సిందిగా, మౌలికవసతులను పునరుద్ధరించాల్సిందిగా అనేక మంత్రిత్వ శాఖలకు ఫెడరల్ గవర్నమెంట్ ఆదేశించింది. ఆరు నగరాలలో 180 రోజుల పాటు విపత్తు పరిస్థితిని సావో పాలో రాష్ట్రం ప్రకటించింది. వాతావరణం ఊహించలేని విధంగా ఉందని, తీవ్రంగా ఉందని అక్కడి వాతావరణ నిపుణులు ప్రభుత్వానికి తెలిపారు. నేడు సావో పాలో గవర్నర్ టార్సిసియో డి ఫ్రీటాస్ ఫెడరల్ అధికారులను కలుస్తారు. వారు విపత్తును ఎదుర్కొనే తీరుపై సమన్వయం చేసి ప్రణాళికను రచించనున్నారని ప్రకటన పేర్కొంది.