హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షం దంచికొట్టింది. అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్ పేట, అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట్, యూసుఫ్ గూడ, గచ్చిబౌలి ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. భారీగా కురిసిన వర్షానికి రోడ్లన్ని జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు చేరడంతో వాహనదారులు ట్రాఫిక్ కి ఇబ్బంది పడ్డారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వానకు జనం బయటకు పోవలంటే భయపడుతున్నారు. అటు జిల్లాల్లోనూ వర్షం భీబత్సం సృష్టిస్తోంది. మహబూబ్ నగర్ లో 9.5 సెం.మీ వర్షపాతం నమోదైంది. నగరంలోని తిరుమలగిరిలో 9సెం.మీ, కూకట్ పల్లిలో 10.4 సెం.మీ, పటాన్ చెరులో 7.2 సెం.మీ, రామచంద్రాపురంలో 8.2 సెం.మీ, బాలానగర్ 6.8, కుత్బుల్లాపూర్ 9.2 సె.మీ, మూసాపేట్ 8 సె.మీ, ఫతేనగర్ లో 7.3 సెం.మీ వర్షపాతం నమోదైందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన
- Advertisement -
- Advertisement -
- Advertisement -