Monday, December 23, 2024

హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన భారీ వర్షం!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అల్పపీడన ద్రోణి కారణంగా తెలుగు రాష్ట్రాలలో వానలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. శనివారం కూడా తెలంగాణలో పలు చోట్ల వడగండ్ల వాన కురిసింది. హైదరాబాద్‌లో శనివారం సాయంత్రం 5.30 తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయింది. ఉరుములతో కూడిన వడగండ్ల వాన కురిసింది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, ఎస్‌ఆర్‌నగర్, సనత్ నగర్, కూకట్‌పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్ వాన పడింది. రోడ్లలో వాన నీరు నిలిచిపోయిన కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో కూడా పలుచోట్ల వాన పడడ్డంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ మార్చి 16 నుంచి 17 వరకు ఆరెంజ్ అలర్ట్, మార్చి 20 వరకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. ఉరుములతో కూడిన వడగండ్ల వానలు కురియవచ్చని, గంటకు 30 నుంచి 40 కిమీ. వేగంతో ఈదురు గాలులు వీచనున్నాయని హెచ్చరించింది. ఆరు జోన్లయిన చార్మినార్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి, ఎల్‌బి నగర్, సికింద్రాబాద్, షేర్లింగంపల్లిల్లో ఆకాశం మేఘావృతంగా ఉండనున్నది. ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉండనున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News